Palamuru Rangareddy Lift Irrigation Project Details : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఈ విషయాలు తెలుసా..? - Palamuru Rangareddy Irrigation Project Details
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2023, 1:25 PM IST
Palamuru Rangareddy Lift Irrigation Project Details : కృష్ణానది వెనుక జలాలను మళ్లించి.. పాలమూరు-రంగారెడ్డి జిల్లాలకు 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన ఉద్దేశంతో.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(Palamuru Rangareddy Lift Irrigation) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 35 వేల కోట్లతో అంచనా వ్యయంతో.. 2015లో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 2016 లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 26 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది.
Palamuru Rangareddy Project Specialties : కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే.. అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు రంగారెడ్డికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించిన పంపుల కంటే.. సామర్థ్యాన్ని మించిన భారీ పంపులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లో ప్రారంభం కానున్నాయి. ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు, రోటర్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. 550 టన్నుల భారీ బరువున్న ఈ పంపులను హార్స్ పవర్స్‌లో చూస్తే.. ఒక్కొక్కటి దాదాపు 95,000ల హెచ్‌పీలతో సమానం. సెకనుకు 3.57 ఆర్పీఎం వేగంతో తిరుగుతాయి. పంపులతోపాటు, విద్యుత్ వ్యవస్థ, గేట్లు, ఉష్ణోగ్రతలు, విద్యుత్ సరఫరా.. ఇలా ప్రతి పనిలోనూ మానవ రహిత వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా స్కాడా పేరుతో రూపొందించిన సాంకేతిక వ్యవస్థను నీటిపారుదల శాఖ వినియోగిస్తోంది. ఇంకా ఈ ప్రాజెక్టు విశేషాలేంటో ఓసారి తెలుసుకుందామా..?