ఈ బస్ షెల్టర్​ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు - కాసర్​గోడ్​ జిల్లాలో మెుబైల్​ బస్​వెయిటింగ్​ షెడ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 3, 2022, 10:33 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ఎక్కడికైనా తరలించే వీలున్న బస్ షెల్టర్​ను కేరళకు చెందిన యువకులు తయారు చేశారు. బైక్​కు కట్టి బస్ షెల్టర్​ను అవసరమైన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. కాసర్​గోడ్​ జిల్లాలో హైవే విస్తరణ పనుల్లో భాగంగా బస్ షెల్టర్​ను కూల్చివేశారు. దీంతో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు తీ​వ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం కాసర్​గోడ్​ జిల్లా పెరియా ప్రాంతంలోని యువకుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ యువకుల బృందం మొబైల్​ బస్​​ షెడ్​ను నిర్మించాలని ఓ వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. దీని కోసం ఆ ప్రాంతంలోని వ్యాపారులు, సామాజిక సంస్థలను సంప్రదించి నిధులను సేకరించారు. అనంతరం, మొబైల్ బస్ షెడ్‌ను నిర్మించారు. ఈ షెడ్‌ను మోటర్‌బైక్‌కు జత చేసి ఎక్కడికైనా తరలించవచ్చు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.