Prathidwani : పార్లమెంటు భవనం మార్పు సరే... మారాల్సిన అంశాలు ఏమిటి?

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 8:54 PM IST

New Parliament Building Today Prathidwani : భారత పార్లమెంటు నూతనంగా నిర్మించిన భవనంలోకి మారుతోంది సరే.. మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ చర్చలు కూడా నిర్మాణాత్మకంగా మారుతాయా? ప్రజల మద్దతుతో ఎన్నికవుతున్న ఎంపీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? ప్రశ్నోత్తరాల సమయం సద్వినియోగం అవుతోందా? పార్లమెంటు సమావేశమైన ప్రతిసారీ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదంతో సమావేశాలు ఎందుకు పదేపదే వాయిదా పడుతూంటాయి? లోపం ఎక్కడ ఉంది? రాజ్యాంగ స్ఫూర్తి మేరకు వ్యవస్థని నిలబెట్టడానికి ఏం చేయాలి?

ఇందుకోసమేనా మనం ఎన్నుకునేది? దీనికోసమేనా కష్టపడి ఎన్నికయ్యేది? కొత్త భవనంలోనైనా పార్లమెంటు సమావేశాలు మరింత ఫలవంతంగా సాగాలంటే ఏం చేయాలి? చర్చలేకుండానే ఆమోదం పొందుతుండడం దేనికి సంకేతం? ప్రజల ఆకాంక్షలకు తగిన రీతిలో చట్టసభల్ని తీర్చిదిద్దడం ఎలా? ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న నేతలు చట్టసభల్లో ఏం చేస్తున్నారు? సంఖ్యాబలం స్థానంలో విస్తృత సమ్మతి మేరకు నిర్ణయాలు ఎలా? చట్టసభ నిర్వహణలో ఆదర్శ విధానాలు ఉన్న దేశాల నుంచి ఇంకా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఇదీ నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.