Neglect of Authorities on Nala in Gajularamam : బాచుపల్లిలాంటి నాలాలు నగరంలో ఎన్నో.. ఆందోళనలో తల్లిదండ్రులు - Quthbullapur Latest News
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2023, 7:43 PM IST
Officiers Respond on Boy Died in Nala at Hyderabad : మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన మిథున్ రెడ్డి(4) అనే బాలుడు మృతి చెందిన (Boy Died in Nala at Hyderabad) విషయం తెలిసిందే. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. దీంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఎన్‌ఆర్ఐ కాలనీలోని బాలుడి ఇంటి వద్ద నాలా మూత, చుట్టుపక్కల తాత్కాలికంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు దీనికి బాధ్యుడిని చేస్తూ వార్డు ఆఫీసర్‌ను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ గోపి తెలిపారు. స్థానిక ఏఈపై కూడా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. వర్షాలు పడిన సమయంలో స్థానికంగా ఉన్న ప్రజలు నాలాలపై కానీ మ్యాన్‌హోల్ మూతలను తొలగించవద్దని ఆయన సూచించారు.
Neglect of Authorities on Nala in Gajularamam : మరోవైపు కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారంలో నిర్మాణం చేపడుతున్న నాలా (Construction Nala in Gajularamaram )ప్రమాదకరంగా మారింది. వరద నీరు వెళ్లేందుకు వొక్షిత్ ఎంక్లేవ్‌లో అధికారులు గత నెలలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. నాలా చుట్టూ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారులు వదిలేశారు. దీని పక్కనే చిన్నపిల్లల పాఠశాల ఉండటంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని.. చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంగళవారం బాచుపల్లిలోని నాలాలో పడి మిథున్‌రెడ్డి అనే బాలుడు చనిపోగా.. గాంధీనగర్ నాలాలో కొట్టుకుపోయి మరో మహిళ చనిపోయింది. ఇంతజరిగినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.