బైక్ స్పీడో మీటర్లోకి దూరిన పాము - హీరోహోండా బైక్‌లో పాము
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16682634-thumbnail-3x2-snake.jpg)
మధ్యప్రదేశ్‌లో వేర్వేరు ఘటనల్లో రెండు పాములు కలకలం సృష్టించాయి. నర్సింగ్పుర్ జిల్లాలో ఓ వ్యక్తి బైక్ స్పీడో మీటర్లో పాము ఇరుక్కుపోయింది. బర్హతా ప్రాంతంలోని నజీర్ ఖాన్ అనే వ్యక్తి రోజులాగే తన బైక్‌ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా పాము బుసలు కొట్టిన శబ్ధం వినిపించింది. బైక్‌ని పూర్తిగా గమనించిన యువకుడు స్పీడోమీటర్‌లో ఉన్న పామును గుర్తించాడు. గ్రామస్థుల సహాయంతో గ్లాస్ పగులకొట్టి పామును సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మరో ఘటనలో మంద్సౌర్ ప్రాంతంలోని ఓ పంట పొలంలో సోయాబీన్ని కోస్తున్న రైతులకు కొండచిలువ కనిపించింది. పామును చూసి రైతులు హడలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు 12 అడుగుల పొడవున్న కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST