Nandamuri Ramakrishna on Chandrababu Fans Death చంద్రబాబు అరెస్టుతో అభిమానుల మృతి కలచివేస్తోంది.. నందమూరి రామకృష్ణ - మృతుల కుటుంబాలకు రామకృష్ణ సంతాపం న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2023, 12:50 PM IST
Nandamuri Ramakrishna on Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, టీడీపీ సానుభూతిపరులు ఎక్కడికక్కడ రోడ్లపై పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు. కాగా చంద్రబాబు అరెస్టు వార్తను విన్న కొంతమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ అంశాలపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వార్త విని.. ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అన్యాయంపై పోరాటానికి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఏకమవుతున్నారని వెల్లడించారు.
"చంద్రబాబు అరెస్టు వార్త విని.. ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. అన్యాయంపై పోరాటానికి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఏకమవుతున్నారు." - నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ తనయుడు