నల్గొండలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా - అందులో 30 మంది ప్రయాణికులు - రంగారెడ్డిలో కంటైనర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
🎬 Watch Now: Feature Video


Published : Nov 25, 2023, 10:36 AM IST
Nalgonda Bus Accident Today : రాష్ట్రంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. నల్గొండ జిల్లా చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా వినుకొండలోని పెళ్లిక హాజరైన తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం శోకసంద్రంలో మునిగిపోయింది. క్షతగాత్రులను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Rangareddy Bus Accident Today : మరోవైపు.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో ఆర్టీసీ బస్సు కంటైనర్ను ఢీ కొట్టింది. నందిగామ వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.