Mysore Dasara Festival 2023 : మైసూర్ దసరా ఉత్సవాలు షురూ.. యువరాజు ప్రత్యేక పూజలు - మైసూర్ దసరా ఉత్సవాలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 4:53 PM IST

Mysore Dasara Festival 2023 : కర్ణాటకలో మైసూర్​ రాయల్​ దసరా ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ వీటిని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు యువరాజు యధువీర్ వడెయార్. అనంతరం రాజభవనంలో ప్రజాదర్భార్​ నిర్వహించారు. ఈ వేడుకల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం చాముండేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ మైసూర్​ దసరా ఉత్సవాలను 'నాద హబ్బా'గా పిలుచుకుంటారు కర్ణాటక ప్రజలు. ప్రతి ఏడాది వడెయార్ వంశానికి చెందినవారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. చాముండేశ్వరి మాతను వడెయార్‌ వంశ కులదైవంగా భావిస్తారు. మహిషాసురుడ్ని.. చాముండేశ్వరి మాత వధించినందుకు గుర్తుగా ఈ వేడుకలు జరుపుకుంటారు కర్ణాటక ప్రజలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మొత్తం పది రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగుతాయి. అదే విధంగా కుస్తీ పోటీలు సైతం జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న రెజ్లర్లు ఈ పోటీల్లో పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.