వెల్లివిరిసిన మతసామరస్యం- అయ్యప్ప స్వాములకు ముస్లిం విందు - కరీం సాబ్ కర్ణాటక న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 26, 2023, 10:05 AM IST
Muslim Men Serve Food To Ayyappa Devotees : కర్ణాటకలో మత సామరస్యం వెల్లివిరిసింది. అయ్యప్ప స్వాములకు భోజనం పెట్టి ఇతర మతాలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు ఓ ముస్లిం. పరిసర గ్రామాలకు చెందిన 58 మంది అయ్యప్ప స్వాములకు స్వయంగా వడ్డించారు కరీం సాబ్. ఇంతకీ ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారంటే?
రాయచూర్ జిల్లాలోని కవితా టౌన్‌కు చెందిన వ్యక్తి కరీం సాబ్. ఆయనకు మతసామరస్యం ఎక్కువ. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయాలని ఆయన భావించారు. వివిధ గ్రామాలకు చెందిన 58 మంది అయ్యప్ప స్వాములకు ఫోన్లో ఆహ్వానం అందించారు. తన ఇంట్లోనే వంటకాలు తయారు చేసి అయ్యప్ప స్వాములకు స్వయంగా వడ్డించారు కరీం సాబ్. తన మతంపై ప్రేమ ఉందని, అదే సమయంలో ఇతర మతాలపైనా గౌరవం ఉందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మతసామరస్యాన్ని చాటిచెప్పేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తున్నానని కరీం సాబ్ వివరించారు.