ముస్లిం పెళ్లిలో 'బుల్డోజర్ బరాత్'.. అంతా యోగి మహిమ!
🎬 Watch Now: Feature Video
UP bulldozer baraat: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈమధ్య ఎక్కడ చూసినా 'బుల్డోజర్' మాటే వినిపిస్తోంది. అయితే, ఇది నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే! ఇటీవల ఓ ముస్లిం జంట వివాహ వేడుకలోనూ బుల్డోజర్ కనిపించింది. శనివారం బాద్షా-రుబీనా వివాహం జరగ్గా.. పెళ్లి బరాత్‌లో బుల్డోజర్ను ఉపయోగించారు. బాద్షాను అందంగా అలంకరించిన బుల్డోజర్పై ఊరేగించారు. బహ్రాయీచ్ జిల్లాలో ఈ వినూత్న వేడుక జరిగింది. దీన్ని చూసి స్థానికులు 'బుల్డోజర్ బాబాకీ జై' అంటూ నినాదాలు చేశారు. బాద్షా-రుబీనా వివాహాన్ని గుర్తుండిపోయేలా చేసేందుకు ఇలా బుల్డోజర్ను ఉపయోగించినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందిస్తూ.. రాష్ట్రంలో సుపరిపాలనకు బుల్డోజర్ చిహ్నంలా మారిందని బహ్రాయీచ్ సదర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుపమా జయస్వాల్ (భాజపా) పేర్కొన్నారు. బుల్డోజర్ను చూసి నేరస్థులే భయపడుతున్నారని చెప్పుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST