MP Raghuramakrishna Raju on PV Ramesh Comments: పీవీ రమేష్ మాటలకు సీఎం జగన్, వైసీపీ నేతలు భయపడ్డారు: ఎంపీ రఘురామకృష్ణరాజు - MP Raghuramakrishnan Raju news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 5:52 PM IST

MP Raghuramakrishna Raju on PV Ramesh Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​, వైఎస్సార్సీపీ నాయకులపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీవీ రమేష్ మాట్లాడిన మాటలకు జగన్ షాక్ అవ్వగా.. వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోయాయని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్​మెంట్ కేసుకు సంబంధించిన ఒరిజినల్‌ ఫైళ్లన్నీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలే దొంగిలించారని ఆయన ఆరోపించారు. స్కిల్ డెవలప్​మెంట్ కేసులో కావాలనే చంద్రబాబు నాయుడ్ని జగన్ ప్రభుత్వం ఇరికించిందని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు వ్యవహారమంతా సజ్జల రామకృష్ణ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.

Raghu Ramakrishna Raju Comments: ''ఆ దేవుడే దిగివచ్చి చెప్పినా నేను తప్పు చేయనని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగనని ఈరోజు పీవీ రమేష్‌ మాట్లాడిన మాటలకు.. జగన్ షాక్ అయితే.. వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోయాయి. స్కిల్ డెవలప్​మెంట్ కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఫైల్స్​ని ఎవరు దొంగిలించారు..? అనే విషయంలో అనుమానమే అక్కర్లేదు.. కచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వమే దొంగిలించింది. అసలు ఫైల్‌ లేకుండా కేసు ఎలా పెడతారు..?. చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసులన్నీ డొల్ల కేసులే. ఈ కేసుల వల్ల వైసీపీ ప్రభుత్వం గుల్లైపోతుంది. ప్రజా నాయుకుడైన చంద్రబాబు కోసం రాష్ట్ర ప్రజలందరూ ఓ సైన్యంగా నిలబడతారు'' అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.