Motha Mogiddham Program Against CBN Illegal Arrest: 'మోత మోగిద్దాం..!!' చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్, బ్రాహ్మణీ పిలుపు - చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నిరసనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 4:43 PM IST

Motha Mogiddham Program Against CBN Illegal Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మోత మోగిద్దాం పేరిట నిరసన కార్యక్రమానికి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకి మద్దతుగా రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్​లో ఉన్న సైకో జగన్​కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. 

అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే: నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనన్నారు. రేపు రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని కోరారు. ఇంట్లోనో ఆఫీస్​లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండని తెలిపారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ నిరసన తెలపాలని ట్విట‌్టర్‌ ద్వారా పేర్కొన్నారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.

Nara Lokesh Tweet on Motha Mogiddham


ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దాం: అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దామన్నారు. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇదేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దామని లోకేశ్ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.