Moranchapalli Floods : మోరంచపల్లిలో వరదపై సీఎం కేసీఆర్ ఆరా.. రంగంలోకి NDRF - Moranchapalli flood
🎬 Watch Now: Feature Video

CM KCR on Moranchapalli : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని గ్రామాల ప్రజారవాణా పూర్తిగా బంద్ అయ్యింది. భూపాలపల్లి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని మోరంచపల్లి వరద నీటిలో చిక్కుకుంది. మోరంచ వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురై ఇంటి స్లాబ్‌ల పైకి ఎక్కారు. మరికొంతమంది సమీపంలోని చెట్లపైన తలదాచుకున్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అప్రమత్తం చేశారు. మరోవైపు మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారికి సూచించారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలట్రీ అధికారులతో సీఎస్ సంప్రదింపులు జరుపుతున్నారు. అధికారుల ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే గ్రామానికి చేరుకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.