Monkey Travelled In Bus Viral Video : బస్సులో 30 కి.మీలు ప్రయాణించిన కోతి.. బామ్మ పక్క కూర్చొని.. - Monkey Travelled In Bus
🎬 Watch Now: Feature Video
Published : Oct 5, 2023, 10:39 PM IST
Monkey Travelled In Bus Viral Video : సాధారణంగా బస్సులో మనుషులు ప్రయాణించడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలోని ఓ ఆర్టీసీ బస్సులో కోతి ఏకంగా 30 కిలోమీటర్లు ప్రయాణించింది. హవేరి జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి హిరెకెరూర్ పట్టణంలోని హంసబావీ వరకు నిర్భయంగా బస్సు కిటికీ పక్కన కూర్చొని ప్రయాణికులతో కలిసి ట్రావెల్ చేసింది. కోతిని చూసిన ప్యాసెంజర్స్ కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దానికి వెంట తెచ్చుకున్న పండ్లు, బిస్కెట్స్ పెట్టారు. ఈ క్రమంలో అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ బామ్మ పక్కన కూడా వానరం కూర్చుంది. అయితే ఈ ప్రయాణంలో వానరం ఎవరికీ ఎటువంటి హానీ చేయకపోవడం గమనార్హం. ఈ దృశ్యాలను బస్సులో ప్రయాణిస్తున్న గణేశ్ అనే ప్రయాణికుడు తన మొబైల్లో బంధించాడు. వాటిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మందు తాగిన కోతి..
కొన్నాళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలో ఓ వానరం మందు తాగింది. ఓ తాగుబోతు నుంచి మద్యం సీసా లాక్కుని.. తాగేసింది. ఈ వీడియోను చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.