కోతులను చెదరగొడుతున్న వృద్ధుడిపై వానరం రివెంజ్!.. ఒక్కసారిగా మేడపై నుంచి కిందపడి.. - ఉత్తరప్రదేశ్‌లో పైకప్పు నుంచి కింద పడిన వృద్ధుడు
🎬 Watch Now: Feature Video
Monkey Pushes Old Man From Roof : మేడపై నుంచి వృద్ధుడ్ని కిందకు తోసేసింది ఓ కోతి! వానరాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిపై.. కోతి దాడికి తెగబడింది. దీంతో బాధితుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన జరిగింది.
గౌఘట్ కాశ్మీరీ వీధిలో కోతుల సంచారం విపరీతంగా ఉంది. కొన్ని కోతులు ఓ ఇంటి మేడపైకి నానా హంగామా చేస్తుండగా.. వాటిని చెదరగొట్టేందుకు 65 వృద్ధుడు మేడపైకి వెళ్లాడు. అనంతరం వాటిని తరుముతూ.. మేడ అంచువరకు వచ్చాడు. అదే సమయంలో.. ఓ కోతి వృద్ధుడ్ని వెనుక నుంచి నెట్టివేసింది. దీంతో మేడపై నుంచి రోడ్డుపై ఆ వృద్ధుడు కిందపడ్డాడు. వెంటనే అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లు.. బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోతుల కారణంగా చాలా మంది గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. వాటి బెడద నుంచి విముక్తి కలిగించాలని అధికారులను వేడుకుంటున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులను విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.