ETV Bharat / state

ఈనెల 13 నుంచి సీఎం రేవంత్​ మూడు దేశాల పర్యటన - CM REVANTH TO VISIT AUSTRALIA

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి - ఆస్ట్రేలియాలోని క్వీన్స్​ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనున్న సీఎం బృందం.

CM Revanth To Visit Australia
CM Revanth To Visit Australia And Singapore (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 2:14 PM IST

CM Revanth To Visit Australia And Singapore : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 13వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో క్రీడావిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్వీన్స్​ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనున్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారుడు జితేంద్ర రెడ్డి, ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్స్ ఎండి సోనీ బాల, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి వెళ్లనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన : ఈనెల 13వ తేదీ రాత్రి సీఎం బృందం ఆస్ట్రేలియా బయలు దేరుతారు.14, 15, 16, 17 నాలుగు రోజులపాటు ఆస్ట్రేలియాలో సీఎం బృందం పర్యటిస్తుంది. అక్కడ క్వీన్స్​ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనుంది. తిరిగి ఈనెల 18వ తేదీన సింగపూర్ రానున్న ముఖ్యమంత్రి బృందం అక్కడ షాపింగ్ మాల్స్​పైన, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలపైన పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు. అదే విధంగా సింగపూర్‌లో జరగనున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలుస్తుంది. అనంతరం 19వ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వెళ్లనున్నారు. అక్కడ 21 నుంచి 23 వరకు పర్యటించనుంది.

దావోస్‌లో సీఎం రేవంత్ పర్యటన : దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకూ 5 రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ 55వ వార్షిక సదస్సు జరగుతుంది. సీఎంతో పాటు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఇతర ఉన్నతాధికారులు మూడు రోజులు పాల్గొనున్నారు. 2024లో దావోస్‌ పర్యటన సందర్భంగా సుమారు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.

సత్య నాదెళ్లతో సీఎం రేవంత్​ రెడ్డి భేటీ - తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చ

మన్మోహన్​సింగ్​ ప్రపంచంతో పోటీపడేలా దేశానికి పునాది వేశారు : సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.