Sourav Ganguly Daughter Accident : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కుమార్తె సనాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టింది. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఏమైందంటే?
కోల్‌కతా నుంచి రాయ్‌చక్ వెళ్తున్న ఓ బస్సు బెహలా చౌరస్తాలో సనా కారును వెనక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్న సమయంలో, సనా పక్క సీట్లో కూర్చొని ఉన్నారు. అయితే ప్రమాదం తర్వాత ఆ బస్సు వేగంగా వెళ్లిపోగా, కారు డ్రైవర్ దాన్ని వెంబడించారు. కొంతదూరం వెళ్లాక బస్సును అడ్డగించి మరీ గంగూలీ కుమార్తె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ఘటనలో సనా గంగూలీ కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే, ఈ ప్రమాదంపై తన నుంచి ఎటువంటి అధికారిక ఫిర్యాదు రాలేదని వెల్లడించారు.