Misuse of Digital signatures in AP CM Office ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం.. ఐదుగురు అరెస్టు - సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-08-2023/640-480-19248997-thumbnail-16x9-cid-sp-on-misuse.jpg)
Misuse of Digital signatures in AP CM Office: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో.. కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్ల దుర్వినియోగం జరిగినట్లు CID సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఐదుగురు కార్యాలయ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. నిందితులు కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి ‘సీఎం పిటిషన్’లు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులైన రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పని చేస్తున్న ఈ ఐదుగురు సంతకాలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించామన్నారు.
ఒక్కో ఫైల్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారని ఎస్పీ వెల్లడించారు. ఏప్రిల్ నుంచి 3 నెలల్లో 66 సీఎంపీలు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15 లక్షల వరకూ వసూలు చేసినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. అయితే, ఏ ఫైల్‌కు తుది ఆమోదం రాలేదని వెల్లడించారు. ‘‘డాక్టర్లు, టీచర్‌ల బదిలీకి సంబంధించిన దస్త్రాలను సీఎంపీలు జారీ చేశారు. సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా మొదట ఈ డిజిటల్ సంతకాల టాంపరింగ్ చేసినట్టు గుర్తించి ఫిర్యాదు చేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య డిజిటల్ సంతకం దొంగిలించి సీఎంపీలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నాం’’ అని ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు.