సీఎం కేసీఆర్ బర్త్‌డే స్పెషల్ సాంగ్... మీరూ వినండి..
🎬 Watch Now: Feature Video
Srinivasgoud Released a Vedio Song On CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఆడియో, వీడియో ప్రత్యేక గీతాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి కేసీఆర్ పుట్టిన రోజులు పురస్కరించుకుని రామకృష్ణ గౌడ్ ప్రతి ఏడాది ప్రత్యేక గీతాన్ని విడుదల చేయడాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించిన ఆడియో, వీడియో గీతా రూపకల్పనకు సహకారం అందించిన పాట రచయిత పుట్ట శ్రీనివాస్, గాయకుడు రాంకీ, సంగీత దర్శకులు రాజ్‌కిరణ్‌ను మంత్రి అభినందించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు సముద్ర, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పలే లక్ష్మణ్‌రావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. టీవీ, చలన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ, డిజిటల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంత్రి తలసాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. టీవీ పరిశ్రమలో వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని, పరిశ్రమలోని అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బెలూన్‌లు ఎగురవేశారు.
థ్రిల్ సిటీలో కేసీఆర్ జన్మదిన వేడుకలు: రేపు (17న) సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఇందుకోసం నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు పక్కనున్న థ్రిల్ సిటీలో వేడుకలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జబర్దస్త్ ఆర్టిస్టులతో స్కిట్లు ప్రదర్శించనున్నారు.