రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్ - బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 17, 2023, 10:14 AM IST
Minister Srinivas Goud Interview : పదేళ్ల పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా గణనీయంగా అభివృద్ధి చేశామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అభివృద్ధి పరుగులు పెట్టాలంటే మరోసారి పాలమూరు ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు. బీసీ నినాదాన్ని తలకెత్తుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు ఆ సామాజిక వర్గాలకు చేసిందేమి లేదని, బీఆర్ఎస్ మాత్రమే అన్నీ సామాజిక వర్గాలకు న్యాయం చేసిందని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే ఉన్న ఒక్క మోటారును అమ్ముకుంటారు తప్ప.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై వారికి చిత్తశుద్ధి లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ వల్ల నష్టం ఏమీలేదని.. కేవలం ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడానికే ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలు తనకే ఎందుకు ఓటేయాలని ప్రశ్నించగా.. ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని చెబుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..