Minister Srinivas Goud Fires On PM Modi : 'రాష్ట్రానికి వచ్చే ముందు మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి' - శ్రీనివాస్ గౌడ్ మోదీపై ఘాటు వ్యాక్యలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 1:52 PM IST
Minister Srinivas Goud Fires On Pm Modi : ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన మోదీకి మహబూబ్‌నగర్‌లో పర్యటించే అర్హతలేదని ఆబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ హోదా హామీ ఇచ్చి నెరవేర్చని ప్రధాని.. మళ్లీ అదే వేదికపై ఏం మాట్లాడేందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
PM Modi Mahabubnagar Tour : కర్ణాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన బీజేపీ సర్కార్.. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు హోదా ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటివాటా తేల్చకుండా నాన్చుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌కు దీటుగా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, మోదీ పాలమూరు అభివృద్ధి చూసిపోవాలని సూచించారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన మోదీ.. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కారని.. అలాంటిది తెలంగాణకు ఎందుకు వస్తున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.