Minister Mallareddy on Chandrababu arrest చంద్రబాబు దేశంలోనే బెస్ట్ సీఎం..! జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. : మంత్రి మల్లారెడ్డి - about Mallareddy reacts on babu tdp
🎬 Watch Now: Feature Video
Published : Oct 14, 2023, 10:49 PM IST
Minister Mallareddy on Chandrababu arrest: దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబును జైళ్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నలభై అయిదేళ్ల సుదీర్ఘ చరిత్ర, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన గొప్ప వ్యక్తిని జైళ్లో పెడతారా..! అంటూ మల్లారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఏం పాపం చేశారని జైళ్లో పెట్టారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఎవరినీ మోసం చేయలేదనీ.. ఎఫ్ఐఆర్ లోనూ చంద్రబాబు పేరు లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగలేకపోయినా.. చూడట్లేదని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి చాలా బాధనిపించిందని.. ఏడుపొచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కుట్ర, అన్యాయం, తప్పు అని వ్యాఖ్యానించారు. వైసీపీ, బీజేపీ ఆడుతున్న నాటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ మద్దతు లేనిదే ఇన్ని రోజులు జైళ్లో పెడతారా... అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాలు ఇలా తయారు కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.