Minister Mallareddy: 'ఆంధ్రాలో కుల రాజకీయాలు తప్ప ప్రజలను ఎవరూ పట్టించుకోవట్లేదు' - telangana latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18393061-thumbnail-16x9-mallareddy.jpg)
Mallareddy in May Day Celebrations: 'ఆంధ్రాలో కుల రాజకీయాలు తప్ప.. ప్రజలను ఎవరూ పట్టించుకోవట్లేదని.. రేపటి నాడు ఆంధ్ర ప్రజలకు అండగా నిలిచేది కేసీఆర్' అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. విశాఖ ఉక్కును కాపాడేది కూడా మన కేసీఆర్ అన్నారు. మే 1 కార్మికుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్మికుల దినోత్సం వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. కార్మికులకు ఎటువంటి లోటు లేకుండా తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోందని.. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ప్రోత్సాహిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖమైన, కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి గుట్ట, అంబేడ్కర్ విగ్రహం అన్నీ కార్మికుల శ్రమకు నిదర్శనమని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
TAGGED:
మేడే వేడుకల్లో మల్లారెడ్డి