గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే - అందుకే హ్యాట్రిక్‌పై అంత ధీమాగా ఉన్నాం : మంత్రి కేటీఆర్ - మంత్రి కేటీఆర్‌తో ఈటీవీ ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video


Published : Nov 10, 2023, 10:08 PM IST
|Updated : Nov 10, 2023, 10:59 PM IST
Minister KTR Exclusive Interview : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. ప్రచారంలోనూ ముందంజలో ఉంది. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి.. ఆ పార్టీ శ్రేణులు తహతహలాడుతున్నారు. అలాగే సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి.. మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమకు పోటీ కాంగ్రెస్‌తోనేనని.. బీజేపీ ఖాతా కూడా తెరవదని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పేర్కొన్నారు. తమకు గతంలో వచ్చిన 88 కన్నా ఒకటి, రెండు సీట్లు ఎక్కువే వస్తాయని.. వెయ్యి శాతం మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను గెలవాలని అనుకుంటోందని.. బీఆర్‌ఎస్ తెలంగాణను గెలిపించాలని కోరుకుంటోందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో సాధించింది చాలా ఉందని.. సాధించాల్సింది ఇంకా ఉందని.. అందుకే కేసీఆర్‌ను సీఎంగా కొనసాగించాలని ఈటీవీ భారత్ ముఖాముఖిలో మంత్రి కేటీఆర్ కోరారు.