ఏప్రిల్ నాటికి దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన వెంకటరెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 1:25 PM IST
Minister Komatireddy On Telangana Bhavan in Delhi : దిల్లీలో తెలంగాణభవన్ నిర్మాణ స్థలాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లారు. అక్కడ పలు బ్లాక్‌లను పరిశీలించారు. ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల వివరాలు, రాష్ట్ర వాటాను అధికారులు మ్యాప్ ద్వారా ఆయనకు వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
Komati Reddy On AP Special Status : ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన ఆస్తులను పరిశీలించామని తెలిపారు. దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ వివరాలను సీఎంకు వివరిస్తానని చెప్పారు. ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని దానికోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.