Balagam movie Mogilaiah : 'బలగం' మూవీ మొగిలయ్యకు కారు బహుమతి - ఎర్రబెల్లి గిప్ట్ ఏమి ఇచ్చారు
🎬 Watch Now: Feature Video
Balagam movie Mogilaiah : 'బలగం' సినిమాలో పాట ద్వారా ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం కింద కారు అందించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆ దంపతులకు కారు అందజేశారు. బలగం సినిమాలో అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకున్న మొగిలయ్య, కొమురమ్మలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని మంత్రి భరోసానిచ్చారు.
దళితులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి దళిత బంధు అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మూడేళ్లలో అర్హులందరికీ దళిత బంధు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మొగిలయ్య అనారోగ్యానికి నిమ్స్‌లో చికిత్స చేయిస్తూ.. అండగా నిలిచారని వివరించారు.
ప్రభుత్వం నుంచి కారు అందుకున్న మొగిలయ్య, కొమురమ్మ దంపతులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యెల్దండి వేణు దర్శకత్వంలో చిన్న సినిమాగా తెరకెక్కిన బలగం ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ బతుకు చిత్రాన్ని వెండితెరపై చూపించిన ఈ సినిమాకు ప్రతి ప్రేక్షకుడు పట్టం కట్టాడు. కంటెంట్ ఉంటే చాలు సినిమా చిన్నదైనా.. పెద్దదైనా ఆదరిస్తారని అనడానికి ఈ చిత్రానికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో.