ఆ రెండు రోజులు అక్కడ వింత ఆచారం.. ఇంతకు ఏం చేస్తారంటే..!
🎬 Watch Now: Feature Video
హోలీ పండగరోజు అక్కడ జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ తరతరాల నుంచి ఓ సంప్రదాయం నడుస్తోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని.. మహిళల్లా సింగారించుకుంటారు. ప్రతి సంవత్సరం హోలీ రోజు పురుషులు మహిళల వేషధారణతో రతి మన్మథుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆచారాన్ని తాము తరతరాలుగా పాటిస్తున్నామంటున్నారు. పురుషులు అంతా చీరలు కట్టి, నగలు ధరించి, పూలతో అచ్చం మహిళలు అన్నట్లుగా సింగారించుకుంటారు. పురుషులు ఆడవాళ్ల మాదిరిగా వేషధారణ చేసుకుని పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని వారి నమ్మకం. అందుకోసమే ఇలాంటి వేషంలో దర్శనం ఇస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఈ వేడుకలు చూడడానికి కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం ప్రజలు భారీ ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పెళ్లి కానీ యువకులు మెుక్కుకుంటే పెళ్లి అవుతుందని వారి నమ్మకం. ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్లో కొనసాగుతోంది.