కాటేసిన పాముతో ఆస్పత్రికి- ఇంజెక్షన్ చేయండంటూ హాస్పిటల్లో హల్చల్! - Man took Snake To Hospital
🎬 Watch Now: Feature Video
Published : Nov 21, 2023, 5:30 PM IST
|Updated : Nov 21, 2023, 6:06 PM IST
Man took Snake To Hospital Viral Video : కాటువేసిన నాగుపామును ఆసుపత్రికి తీసుకువచ్చి హల్చల్ చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో జరిగింది. లాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్ఖీ గ్రామానికి చెందిన సూరజ్ అనే యువకుడుని తన ఇంటివద్ద సోమవారం సాయంత్రం పాముకాటు వేసింది. సూరజ్ భయపడకుండా తనను కాటువేసిన పామును సంచిలో బంధించారు. చికిత్స కోసం వెంటనే దగ్గర్లోని మీర్జాపుర్ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్‌పై వెళ్లాడు.
ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని తాను పాముకాటుకు గురయ్యానని వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులను కోరాడు. సూటు, బూటులో వెళ్లిన సూరజ్‌ను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఏ పాము కాటువేసిందో చెప్పాలని.. ఆ తర్వాతే ఇంజక్షన్ ఇస్తామని సూరజ్‌ను వైద్యులు కోరారు. తన వెంట తెచ్చిన పామును సంచిలోనుంచి తీసి ఎమర్జెన్సీ వార్డు బెడ్‌పై ఉంచాడు సూరజ్. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వైద్యులు ఆసుపత్రి సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పామును సంచిలో ఉంచాలని వారంతా కోరారు. దీంతో సూరజ్ మళ్లీ పామును పట్టుకుని సంచిలో బంధించాడు. తనను ఏ పాము కాటువేసిందో వైద్యులు గుర్తించేందుకే దానిని ఆసుపత్రికి తీసుకువచ్చింది. అనంతరం సూరజ్‌కు వైద్యులు యాంటీవీనమ్ ఇంజక్షన్ ఇచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పామును సూరజ్ తొలగించి పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.