ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో చిరుత సంచారం - cheetah come into the population
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17284468-thumbnail-3x2-photo.jpg)
ఉత్తరాఖండ్‌లో చిరుత కలకలం సృష్టించింది. చంపావత్ జిల్లాలోని సీఎం క్యాంపు ఆఫీసులో రాత్రిపూట చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మార్జినల్ టెరాయ్ ప్రాంతాంలోని జనావాసాల చుట్టూ చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత తిరిగే ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచామని తనక్‌పూర్ ఫారెస్ట్ ఆఫీసర్ మహేష్ సింగ్ తెలిపారు. వన్యప్రాణులు, మనషులకు మధ్య ఎటువంటి సంఘర్షణ జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST