ETV Bharat / lifestyle

మిగిలిపోయిన కూరగాయలతో 'వెజ్ మిక్స్​డ్ పచ్చడి'- వేస్ట్ కాకుండా సూపర్ టేస్ట్! 15 నిమిషాల్లోనే ఈజీగా చేసుకోవచ్చు! - HOW TO MAKE MIXED VEGETABLE PICKLE

-ఒక్కసారి చేస్తే చాలా రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు! -ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది!

How to Make Mixed Vegetable Pickle
How to Make Mixed Vegetable Pickle (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Feb 10, 2025, 5:12 PM IST

How to Make Mixed Vegetable Pickle: మీరు టమాటా, మామిడి, నిమ్మకాయ పచ్చడి తినే ఉంటారు. ఇంకా వీటితో పాటు రకరకాల కూరగాయాలతో కూడా పచ్చళ్లు చేసుకుని తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా కూరగాయలను కలిపి మిక్స్​డ్ వెజ్ పచ్చడి ట్రై చేశారా? అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంట్లో రెండు, మూడు కూరగాయలు మిగిలినప్పుడు లేదా మీకు నచ్చిన కూరగాయలన్నింటిని వేసి దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని ఇన్​స్టంట్​గా చాలా రుచికరంగా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఒకసారి చేస్తే నాలుగు రోజుల వరకు.. ఫ్రిజ్​లో పెడితే మరిన్ని రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • ఒక టేబుల్ స్పూన్ ఆవాలు
  • ఒక టేబుల్ స్పూన్ మెంతులు
  • ఒక క్యాలీఫ్లవర్ తరిగిన ముక్కలు
  • ఒక క్యారెట్ ముక్కలు
  • మగ్గించిన రెండు నిమ్మకాయ ముక్కలు
  • ఒక పచ్చి మామిడికాయ ముక్కలు (ఆప్షనల్)
  • రెండు పచ్చిమిరపకాయలు
  • 10 వెల్లుల్లి రెబ్బలు
  • చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క
  • ఒక టేబుల్ స్పూన్ ఉప్పు
  • మూడు టేబుల్ స్పూన్ల ఎండుకారం
  • రెండు టీ స్పూన్ల మెంతిపిండి
  • రెండు టీస్పూన్ల ఆవపిండి
  • రెండు నిమ్మకాయల రసం

తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు

  • రెండు టేబుల్ స్పూన్ల నూనె
  • అర టీ స్పూన్ ఆవాలు
  • మూడు ఎండు మిరపకాయలు
  • అర టీ స్పూన్ ఇంగువ

తయారుచేసే విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి పాన్​ పెట్టి ఆవాలు, మెంతులని విడివిడిగా వేయించాలి.
  • ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడి పట్టి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో గిన్నె తీసుకుని తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్, మగ్గించిన నిమ్మకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి కలపాలి.
  • అనంతరం ఇందులనే తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలపాలి.
  • ఇప్పుడు ఉప్పు, ఎండు కారం, పొడి పట్టిన మెంతిపిండి, ఆవపిండి కూడా వేసి అన్నిటినీ బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఇందులో నిమ్మరసం, నూనె వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • మరోవైపు తాలింపు కోసం స్టౌ ఆన్ చేసి ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి వేయించి పచ్చట్లో వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ నూనె కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది.
  • అంతే టేస్టీ ఇన్​స్టంట్ మిక్స్​డ్ వెజ్ పచ్చడి రెడీ. దీనిని అన్నం, రోటి, దోశల్లాంటివాటిలోకి చాలా బాగుంటుంది.

'ఎగ్ కారం దోశ' ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? స్పైసీ గార్లిక్ చట్నీతో టేస్ట్ అదుర్స్!

మెత్తటి దూదిలాంటి 'ఖుష్బూ ఇడ్లీ- సాంబార్' తిన్నారా? ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ గురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.