Naga Devatha Idols: కలకలం.. బయటపడ్డ వందకుపైగా నాగదేవత విగ్రహాలు - Naga Devatha Idols
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-06-2023/640-480-18847478-13-18847478-1687761282694.jpg)
Large Number of Naga Devatha Idols in Krishna: వందకు పైగా నాగదేవత విగ్రహాలు కృష్ణా నదిలో బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు కాదు.. ఇలా భారీ స్థాయిలో నాగదేవత విగ్రహాలు బయటపడటం స్థానికులలో పలు అనుమానాలకు దారీ తీస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణా నదిలో సుమారు వందకు పైగా నాగదేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలను నాగ ప్రతిష్ఠ చేసే ఆలయాల నుంచి ఎవరైనా తెచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలయాల్లో విగ్రహాలకు స్థలం లేకపోవటంతో విగ్రహాలను ఇలా నీటిలో వదిలేసి ఉంటారని చెప్తున్నారు. ఇన్ని రోజులు నది ప్రవాహం అధికంగా ఉండి ఇవి బహిర్గతం కాకపోయి ఉండవచ్చని, ఇప్పుడు ప్రవాహం తగ్గడంతో బయటపడ్డాయని స్థానికులు అంటున్నారు. పలు ఆలయాలు నుంచి తెచ్చిన విగ్రహాలై ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నీటి ప్రవహం తగ్గటంతో బయటపడ్డయా లేక ఎవరైనా తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.