KTR to Inaugurate Lake Front Park Soon : లేక్ ఫ్రంట్ పార్క్ అందాలు చూద్దాం రండి.. - లేక్ ఫ్రంట్ పార్క్ ప్రారంభోత్సవానికి కేటీఆర్
🎬 Watch Now: Feature Video
Published : Sep 19, 2023, 6:43 PM IST
KTR to Inaugurate Lake Front Park Soon : గ్రేటర్ హైదరాబాద్‌కు తలమానకంగా నిలిచేలా మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రాబోతోంది. నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ సమీపంలో లేక్ ఫ్రంట్ పార్క్‌ను హెచ్ఎండీఏ ఏర్పాటు చేసింది. ఈ పార్కును త్వరలోనే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ అభివృద్ధి, సుందరీకరణ చేపట్టడంలో భాగంగా జలవిహార్ పక్కనే ఉన్న 10 ఎకరాల విస్తీర్ణంలో లేక్ ఫ్రంట్ పార్క్‌ను నిర్మించింది. ప్రధాన భాగాల్లో ఎలివేటెడ్ వాక్‌వేలు, హుస్సేన్ సాగర్ వ్యూ పాయింట్ వాక్‌వే ఏర్పాటు చేశారు. లేక్ ఫ్రంట్ పార్క్ 15 మీటర్ల పొడవు వరకు వాటర్ బాడీపై డెక్‌తో కాంటిలివర్‌గా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా టాయిలెట్ బ్లాక్‌లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లేక్ ఫ్రంట్ పార్క్ నిర్మాణ డిజైన్‌లో 4 లక్షల మొక్కలతో కూడిన ల్యాండ్‌స్కేప్‌ను అభివృద్ధి చేశారు. అలాగే మొక్కల బార్ కోడింగ్ నేమ్ బోర్డులను మొదటిసారిగా పరిచయం చేస్తున్నారు.