KTR Reaction on TDP Protest in Telangana : ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలోనే తేల్చుకోవాలి: కేటీఆర్
🎬 Watch Now: Feature Video
Minister KTR on Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్య అని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఏపీలో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు ఏంటి అని ప్రశ్నించారు. ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలోనే తేల్చుకోవాలని పేర్కొన్నారు. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని తేల్చి చెప్పారు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుందని వివరించారు. వైసీపీ, టీడీపీకు తెలంగాణలో ప్రాతినిధ్యం లేదని చెప్పారు.
Minister KTR Reacts on Chandrababu Arrest : తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలసి ఉంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ సెక్టార్(IT Sector)లో ఆందోళనలు జరగలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై తమ పార్టీ నేతలు స్పందిస్తే.. అది వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. తాము తటస్థంగా ఉంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆందోళనలకు అనుమతిపై లోకేశ్ ఫోన్ చేయించి అడిగారని పేర్కొన్నారు. ఒకరికి అనుమతిస్తే.. వేరే పార్టీకీ అనుమతి ఇవ్వాల్సివస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు.