Kodi Punju in Lockup : లాకప్‌లో కోడి పుంజు.. ఇంతకీ ఏం నేరం చేసింది..? - Kodi Punju in Lockup Mahabubnagar
🎬 Watch Now: Feature Video
Kodi Punju in Lockup Jadcherla : ఎక్కడైనా దొంగతనాలు, దోపీడీలు జరిగితే నిందితులను లాకప్‌లో వేస్తారు. బాధితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తారు. కానీ ఓ పోలీసు స్టేషన్‌లో మాత్రం నిందితుడితో సహా బాధితుణ్ని కూడా స్టేషన్‌లో వేశారు.. విచిత్రం ఏంటంటే బాధితుడు మనిషి కాదు ఓ కోడి..ఇంతకీ ఆ కొక్కొరొక్కో కోడి ఎందుకు జైలు పాలైనట్టు..?
ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లాకప్‌లో నిందితులుండటం చూశాం... కానీ జడ్చర్ల పోలీసులు మాత్రం స్టేషన్‌లో కోడిపుంజును ఉంచారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి శివారులో తరచు నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కరువెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దొంగతనం చేస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని కోడిపుంజుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. వారు ఆ వ్యక్తితో పాటు కోడిని లాకప్‌లో ఉంచారు. కాగా రెండు రోజులుగా పోలీసులు వేసే గింజలను తింటూ కోడిపుంజు పోలీస్ స్టేషన్‌లో కూతబెడుతుండడంతో అక్కడి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్టేషన్‌లోని కుక్కలు చంపుతాయనే భయంతో కోడిని లాకప్‌లో పెట్టినట్లు పోలీసులు తెలిపారు.