Kishan Reddy Comments on CWC Meeting : 'తప్పుడు సర్క్యులర్ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలి' - కిషన్‌రెడ్డి కామెంట్స్
🎬 Watch Now: Feature Video


Published : Sep 16, 2023, 8:00 PM IST
Kishan Reddy Comments on Congress and BRS : కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలను.. హైదరాబాద్‌లో నిర్వహించే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా.. ఓట్ల రాజకీయాలు చేసి.. అమరుల త్యాగాలను మరుగునపరిచారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు నిర్వహించి.. హైదరాబాద్‌లో నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో.. ఆదివారం జరగనున్న కేంద్రమంత్రి అమిత్ షా సభ నేపథ్యంలో ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Kishan Reddy Visits Amit Shah Meeting Arrangements : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఎద్దేవా చేశారు. పరేడ్ మైదానంలో కేంద్ర అధికారిక కార్యక్రమాన్ని.. బీజేపీ సభగా హైదరాబాద్ పోలీసులు సర్కులర్ ఇవ్వడంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్క్యులర్ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.