కారులో దూరిన 10 అడుగుల కింగ్​ కోబ్రా నాలుగు గంటలు శ్రమించి - కింగ్​ కోబ్రాను పట్టుకున్న అటవీ సిబ్బంది

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2022, 11:13 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కారులో 10 అడుగుల కింగ్​ కోబ్రా చేరింది. జై సింగ్​ కైగా ప్రాంతం నుంచి కార్వార్​కు కారులో వెళ్తున్నాడు. మార్గమధ్యలో మల్లాపుర్​ ప్రాంతంలోని ఓ రోడ్డు పక్కన ఆగాడు. అయితే ఆ సమయంలో 10 అడుగుల కింగ్​ కోబ్రా తన కారు ముందుభాగంలో ప్రవేశించడం గమనించాడు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న సిబ్బంది దాదాపు 4 గంటల పాటు శ్రమించి పామును బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టినట్లు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.