శిర్డీకి పోటెత్తిన భక్తులు.. 80 వేల మందికి కిచిడీ ప్రసాదం పంపిణీ! - శిర్డీ సాయిబాబా ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
ఆషాఢ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉచితంగా షాబుదాన (సగ్గుబియ్యం) కిచిడీ ప్రసాదం అందజేస్తున్నట్లు సాయి సంస్థాన్ నిర్వాహకులు తెలిపారు. పండగ సందర్భంగా దాదాపు 80వేల మంది భక్తులు బాబాను దర్శించుకోనున్నట్లు వెల్లడించారు.
పండర్పుర్ టూ శిర్డీ..
ఏకాదశి సందర్భంగా ఆలయానికి శిర్డీ సాయిబాబా భక్తులు పోటెత్తారు. ప్రజల ఆరాధ్యదైవం బాబా దర్శనం కోసం పండర్‌పుర్‌కు వెళ్లిన భక్తులు అక్కడ నుంచి శిర్డీ బాటపట్టారు. ఏకాదశి పర్వదినాన శిర్డీ బాబాను భక్తులు దర్శించుకుంటారు. పండగ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సాయిబాబా సంస్థాన్.. భక్తుల కోసం 12 వేల కిలోల కిచిడీ ప్రసాదాన్ని సిద్ధం చేసింది. అర్చకులు బాబా విగ్రహాన్ని తులసి మాల, బంగారు ఆభరణాలతో అలంకరించారు. సంవత్సరమంతా సాయిబాబాకు పూల మాలలు వేస్తారు.. కానీ ఆషాఢ ఏకాదశి పురస్కరించుకొని బాబాకు తులసి మాల వేస్తారని పూజారులు చెబుతున్నారు.
"గతేడాది ఏకాదశి నాడు 75 వేల మంది భక్తులు శిర్డీ బాబాను దర్శించుకున్నారు. ఈసారి సుమారు 80 వేల దాకా వస్తారని అంచానా వేస్తున్నాం. భక్తులందరికీ బాబాను దర్శించుకోడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈసారి 7 వేల కిలోల షాబుదాన, 3 వేల కిలోల వేరుశెనగ, 2 వేల కిలోల బంగాళాదుంపలు, 700 కిలోల నెయ్యి, 60 కిలోల భాగర్, 300 కిలోల మిరపకాయలను ఉపయోగించి ఈ ప్రసాదాన్ని సిద్ధం చేశాం. ఆషాడ ఏకాదశి సందర్భంగా గురువారం రాత్రి విఠల్ రుఖ్మిణి విగ్రహంతో సాయి రథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది."
- పి శివశంకర్, సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్