Kesineni Nani comments on Chandrababu remand న్యాయం గెలుస్తుంది.. ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు:కేశినేని నాని - జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-09-2023/640-480-19479326-327-19479326-1694356842988.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 10, 2023, 8:16 PM IST
Kesineni Nani comments on Chandrababu remand: దేశంలో మచ్చలేని నాయకుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒకరు అని... ఆయనపై పెట్టిన కేసులో పసలేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. తమ న్యాయవాదులు లీగల్ టీమ్ చెప్పిన అంశాలను బట్టి చూస్తే అంతా పాజిటివ్‌గానే ఉందని భావిస్తున్నామన్నారు. ఇదో ఫ్యాబ్రికేటెడ్ కేసు అని తప్పకుండా న్యాయం గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో యువత బాగుపడాలనే సీమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని నాని పేర్కొన్నారు. ఎలాంటి అవినీతి జరగలేదు కేవసం ఇది రాజకీయ ప్రేరేపిత కేసుని కేశినేని ఆరోపించారు.
కొందరు పోలీసు అధికారులు ప్రమోషన్లు, బదిలీల కోసం అతిగా వ్యవహరిస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం.. నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాధికారులను లొంగదీసుకుని వాళ్లకు కావాల్సినట్లు చెప్పించుకుంటున్నారని నాని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా... చివరికి న్యాయం.. ధర్మమే... గెలుస్తుందని కేశినేని పేర్కొన్నారు.