కశ్మీర్లో రోడ్డుపై టన్నుల కొద్దీ మంచు- ఎలా తొలగిస్తున్నారో చూశారా? - పీర్ పంజాల్ పర్వతాల్లో మంచువాన
🎬 Watch Now: Feature Video
Published : Dec 2, 2023, 3:12 PM IST
Jammu Kashmir Snowfall Today : జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలోని పీర్ పంజాల్ పర్వత ప్రాంతంలో విస్తారంగా మంచు కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారి మొఘల్ రోడ్డుపై భారీగా ఎత్తున మంచు పేరుకుపోయింది. కాగా, ఈ రోడ్డు రాజౌరీ, పూంఛ్ రెండు జిల్లాలోని ప్రజలకు ముఖ్య మార్గంగా ఉంది. దీనిపై నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు భారీ హిమపాతం కారణంగా ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ప్రత్యేక యంత్రాలతో సహాయక చర్యలు..
టన్నుల కొద్దీ పేరుకుపోయిన మంచును తొలగించేందుకు స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. ప్రత్యేక యంత్రాల సాయంతో రోడ్డుపై పడి ఉన్న మంచు దిబ్బలను సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రోడ్డుపై పేరుకుపోయిన మంచును మరింత త్వరగా తొలగించేందుకు అవసరమైతే మరిన్ని యంత్రాలను తరలిస్తామని వివరించారు. ఈ విషయంలో సాధారణ పౌరులు కాడా సహకారం అందించాలని సంబంధిత అధికారి కోరారు.