కశ్మీరీ గేటు చుట్టూ ప్రవహిస్తున్న వరద!.. డ్రోన్ విజువల్స్ చూసేయండి..
Kashmere Gate Flood Today : దేశ రాజధాని దిల్లీలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. కొన్ని ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. కశ్మీరీ గేటు ప్రాంతంలో వరద నీరు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. ఆ ప్రాంతమంతా నదిని తలపిస్తోంది. మరోవైపు.. యమునా నది నీటి మట్టం శుక్రవారం తగ్గింది. దీంతో ఆ నది పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ముకుంద్‌పుర్ చౌక్ ప్రాంతంలో వరద నీటిలో స్నానం చేస్తూ ముగ్గురు బాలురు కాలువలో మునిగి మరణించారని అధికారులు తెలిపారు. వారంతా జహంగీర్‌పురి నివాసితులని చెప్పారు.
Uttar Pradesh Noida Floods : ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో వ్యవసాయ పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. పంట పొలాల్లో నడుము లోతు వరద నీరు వచ్చింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Bihar Floods : మరోవైపు.. పట్నాలో ఉన్న బిహార్ అసెంబ్లీ అవరణలోకి భారీగా వరద నీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన సచివాలయం సిబ్బంది.. నీటిని పైపుల ద్వారా తోడి ట్యాంకర్లతో బయటకు పంపించారు. అసెంబ్లీ ఆవరణలోకి వరద నీరు రావడంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.