CM Revanth Reddy Orders on New Ration Cards Distribution : కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పౌరసరఫరాల శాఖ, నీటిపారుదలశాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
కొత్త రేషన్ కార్డుల డిజైన్ల పరిశీలన : అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు.
9 ఏళ్ల నిరీక్షణకు తెర - రేషన్ కార్డుల్లోకి కుటుంబ సభ్యుల పేర్లు
రేషన్‌కార్డుల కోసం ఇబ్బంది పడకండి - సదా 'మీ-సేవ'లో అప్లై చేసుకోవచ్చు