కార్యకర్తను కొట్టిన సిద్దరామయ్య.. వీడియో వైరల్ - కార్యకర్తపై చేయిచేసుకున్న సిద్దరామయ్య
🎬 Watch Now: Feature Video
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు.. సిద్ధ రామయ్య సొంత పార్టీ కార్యకర్తపైనే చేయి చేసుకున్నారు. శివానంద సర్కిల్ సమీపంలోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం కసరత్తు జరుగుతున్నాయి. ఈ తరుణంలోని టికెట్ ఆశించిన.. ఎమ్మెల్యే హరిహర్ రామప్పకు చెందిన మద్దతుదారులు ఆయనకే టికెట్ ఇవ్వాలని సిద్ధ రామయ్యను డిమాండ్ చేశారు. ఇందుకోసమే శుక్రవారం ఉదయం ఆయన ఇంటి ముందు రామప్ప మద్ధతుదారులు భారీగా గూమిగూడారు. ఈ నేపథ్యంలో సిద్ధ రామయ్య ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే వారందరి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ధ రామయ్య.. కోపంతో ఆ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. అనంతరం అక్కడ్నుంచి కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.