గాలి నింపుతుండగా పేలిన జేసీబీ టైరు.. ఇద్దరు మృతి - ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 5, 2022, 5:50 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Tyre burst while filling air in JCB in Raipur: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పుర్ జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. జేసీబీ వాహ‌నం టైర్‌లో గాలి నింపుతుండ‌గా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మెకానిక్‌లు ప్రాణాలు కోల్పోయారు. వారు మ‌ధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మే 3వ తేదీన ఈ ప్రమాదం జరగగా.. దానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. ఓ వ్యక్తి జేసీబీ వాహనం టైరులో గాలి నింపుతుండ‌గా.. మ‌రో వ్యక్తి వ‌చ్చి ఆ టైర్‌ను ప‌లుమార్లు.. ప్రెస్ చేయడం సీసీటీవీలో రికార్డు అయింది. టైరులో గాలి ఒత్తిడి అమాంతం పెరిగిపోవడం వల్ల అది అకస్మాత్తుగా పేలిపోయింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.