స్క్రాప్‌తో వింటేజ్ బైక్ బొమ్మల తయారీ.. ఐటీఐ విద్యార్థుల అద్భుత ప్రతిభ..
🎬 Watch Now: Feature Video
ITI Students Makes Vintage Bikes : ఒడిశా బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులు స్క్రాప్‌తో వింటేజ్ బైక్ బొమ్మలను తయారు చేశారు. వారికి ఐటీఐ కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అండగా నిలిచింది.
బ్రహ్మపుర ఐటీఐ కళాశాల విద్యార్థులు.. బోల్టులు, పాత బైక్ చైన్లు వంటి స్క్రాప్ మెటీరియల్‌ను ఉపయోగించి.. కేటీఎం, డ్యూక్, యమహా, బుల్లెట్ వంటి వింటేజ్ బైక్ బొమ్మలను రూపొందించారు. 'బెస్ట్ ఫ్రమ్ వేస్ట్' అనే సందేశంతో బ్రహ్మపుర ఐటీఐ కళాశాలలోని ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రమెంట్ మెకానిక్స్, వెల్డర్ సహా అన్ని ట్రేడ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. విద్యార్థులు స్క్రాప్ సామాన్లను గ్యారేజీల నుంచి సేకరించారు. జులై 15న బ్రహ్మపురలోని ఐటీఐ కాలేజీలో ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థుల తయారు చేసిన వింటేజ్ బైక్‌ల బొమ్మలను ఉంచారు. 15 రోజులు కష్టపడి నిరుపయోగంగా ఉన్న స్క్రాప్ మెటీరియల్‌తో బైక్‌లను తయారు చేశారు విద్యార్థులు.