Interview with Traveler Sampath: విశాఖ కుర్రాడు.. సైకిల్​పై దేశాన్ని చుట్టేస్తున్నాడు - cycle Traveler

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 16, 2023, 1:27 PM IST

Interview with Traveler Sampath: ఆ యువకుడికి దేశ పర్యటన అంటే ఎంతో ఆసక్తి. అదే అసక్తిని ఓ సామాజికాంశంపై ప్రచారానికి వినియోగించుకుంటూ వస్తున్నాడు. వినూత్నంగా దేశ పర్యటన చేస్తున్నాడు. అందుకు అనుగుణంగానే డిగ్రీ గ్రూపును.. బీఏలో టూర్స్‌, ట్రావెల్స్​ను ఎంపిక చేసుకున్నాడు విశాఖకు చెందిన సంపత్. ఇప్పటికే దేశాన్ని 2 సార్లు చుట్టి వచ్చి.. మరోసారి సైకిల్​పై నేపాల్, భుటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులకు పయనమయ్యాడు. ఈ రైడ్‌లో 1800 కిలోమీటర్లను 25 రోజుల్లో పూర్తి చేయాలని సంపత్ నిర్ణయించుకున్నాడు. ఈసారి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ప్రచారం చేయనున్నాడు. సంపత్​ను లంకపల్లి బుల్లయ్య కళాశాల కరస్పాండెంట్ మధుకుమార్‌ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.  దీంతో సైకిల్​పై దేశాన్ని చుట్టేస్తున్నాడు ఈ విశాఖ కుర్రాడు. ఇప్పటికే దేశాన్ని రెండు సార్లు సంపత్ చుట్టేశాడు. మోటారు సైకిల్ పై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైడ్ విజయవంతంగా పూర్తి చేశాడు. సందేశాత్మకంగా సాగే ఈ రైడ్ ఉద్దేశ్యంపై సంపత్, అతడిని ప్రోత్సహిస్తున్న కళాశాల కరస్పాండెంట్ మధుకుమార్‌లతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.