International Yoga Day 2023 : ఒకేసారి 1.53లక్షల మందితో యోగా.. సూరత్​ గిన్నిస్ రికార్డ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2023, 5:07 PM IST

గుజరాత్​ సూరత్​కు చెందిన 1.53లక్షల మంది ఒకేసారి యోగా చేసి గిన్నిస్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహించారు. 'ఒకేచోట అతిపెద్ద యోగా ​సెషన్​'గా రికార్డ్ సృష్టించినట్లు గిన్నిస్​ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​తో పాటు మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్​లోని కోటా నగరం పేరిట ఉండేంది. 2018లో 1,00,984 మంది ఒకేసారి యోగా చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.

"ఈ యోగా సెషన్​కు 1.25 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 1.53 లక్షల మంది వచ్చారని గిన్నిస్​ ప్రతినిధులు ధ్రువీకరించారు. 10 కిలోమీటర్ల పొడవైన రోడ్డుపై ఇరువైపులా 1.53లక్షల మంది యోగా చేశారు. 135 బ్లాకులుగా విడగొట్టి.. సుమారు 1,000 మంది ప్రజలు యోగా చేశారు. " అని సూరత్ మున్సిపల్ అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం గిన్నిస్ ధ్రువీకరణ పత్రాన్ని సీఎం భూపేంద్ర పటేల్​కు అందజేశారు ప్రతినిధులు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో 21 యోగా స్టూడియోలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.