రోడ్డుపై వెళ్తున్న యువతి చేతిలోంచి ఫోన్​ లాక్కుని పరార్​.. లైవ్ వీడియో - ఇందౌర్​లో యువతి చోతిలోంచి ఫోన్ లాక్కొని పరార్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2023, 3:35 PM IST

మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​ నగరంలో ఇద్దరు యువకులు పట్టపగలే రెచ్చిపోయారు. రోడ్డుపై ఫోన్​ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ప్రాంజలి సింగ్ బఘేల్ అనే యువతి చేతిలోంచి ఫోన్​ లాక్కొని బైక్​పై పరారయ్యారు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రాంజలి సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు లసూడియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అర్పిత్, పీయూష్​గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి, ప్రశ్నిస్తున్నారు. 

బాధితురాలు ప్రాంజలి సింగ్ బఘేల్.. మధ్యప్రదేశ్​లోని షాడోల్​కు చెందిన యువతి. ఆమె ఇందౌర్​లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. విధులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు బస్టాప్​ వైపు నడుస్తున్న క్రమంలో ఇద్దరు దొంగలు వెనక నుంచి వచ్చి ఆమె చేతిలోంచి ఫోన్​ లాక్కెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే.. ఈ చోరీ గురించి తన తండ్రికి చెప్పవద్దని తల్లిని ప్రాంజలి వేడుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. తన కుమార్తెను ఉద్యోగం కోసం ఇందౌర్​కు పంపడం తండ్రికి ఇష్టం లేదని, ఇలా జరిగిందని తెలిస్తే ఏం చేస్తారోనన్న భయమే ఇందుకు కారణమని తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.