Pushpa 2 The Rule Rashmika : వరుస విజయాలతో మంచి జోష్ మీదుంది హీరోయిన్ రష్మిక మంధాన. రీసెంట్గా 'పుష్ప 2' చిత్రంతో మరోసారి సినీ ప్రియులను మెప్పించింది. సినిమాలో ఆమె నటనకు అంతటా విశేష ఆదరణ దక్కింది.
అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దర్శకులు సందీప్ వంగా, సుకుమార్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఇద్దరి దర్శకుల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని తెలిపింది.
"ఈ ఇద్దరి దర్శకుల సినిమాల్లో కథానాయికల పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ హీరోలను వెనక ఉండి నడిపించే విధంగా వీరు కథలు రాస్తారు. ఇలాంటి పాత్రలు తెరపై చూపించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. వీరిద్దరి సినిమాల్లో అవి తరచూ కనిపిస్తుంటాయి. యానిమల్‌లో గీతాంజలి, పుష్పలో శ్రీవల్లి పాత్రలు మహిళలు ఎంతో బలమైన వారో తెలియజేస్తాయి. అలాంటి పాత్రలను పోషించడానికి నేను ఎంతో ఇష్టపడతాను" అని చెప్పింది.
అలానే తాను నటించిన గత చిత్రాల హీరోలు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ల గురించి కూడా మాట్లాడింది. వారితో మంచి స్నేహం ఉందని చెప్పింది. నటీ నటుల మధ్య అనుబంధం ఉండాలని తెలిపింది. ఆయా చిత్రాల షూటింగ్ సమయంలో రణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారని చెప్పుకొచ్చింది.
అలాంటి భాగస్వామి కావాలి - ఇంకా రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్ గురించి కూడా మాట్లాడింది రష్మిక. తనలాంటి మనస్తత్వం ఉన్న భాగస్వామి కావాలని చెప్పుకొచ్చింది. " నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలి. ఎప్పుడూ నాకు భద్రతనివ్వాలి. జీవితంలోని కష్ట సమయంలో నాకు అండగా నిలవాలి. కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. శ్రద్ధ వహించాలి. మంచి మనసు ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉండే జీవితమంతా కలిసిఉండొచ్చు" అని వెల్లడించింది.
Rashmika Upcoming Movies : కాగా, నేషనల్ క్రష్ రష్మిక చేతిలో ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ధనుశ్‌తో కుబేరా, విక్కీ కౌశల్‌తో ఛావా, సల్మాన్ ఖాన్‌తో సికందర్, ది గర్లఫ్రెండ్ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.
'నన్ను నమ్మండి' - లీక్డ్ ఫొటోపై 'రాజాసాబ్' బ్యూటీ నిధి అగర్వాల్ రియాక్షన్
70 ఏళ్ల నటుడితో 31 ఏళ్ల నటి రిలేషన్షిప్! - హాట్‌టాపిక్‌గా మారిన జంట!!