దేశంలో​ ఇండో-పాక్ మ్యాచ్​ మేనియా.. భారత్​ గెలవాలంటూ పూజలు, హోమాలు.. స్టేడియం వద్ద సందడి షురూ - అహ్మదాబాద్ స్టేడియం కెపాసిటీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 10:35 AM IST

Ind vs Pak World Cup 2023 : దేశవ్యాప్తంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్​.. మేనియా మొదలైంది. భారత్ నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ శనివారం ఉదయం నుంచే అహ్మదాబాద్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. ఇక దాయాదుల పోరులో భారత్ విజయం సాధించాలని దేశమంతటా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర్​ప్రదేశ్ వారణాసి, కాన్పుర్​లో క్రికెట్ ఫ్యాన్స్ హోమాలు నిర్వహిస్తున్నారు. ఆటగాళ్ల ఫొటోలు, జాతీయ జెండాలతో పూజలో పాల్గొన్న అభిమానులు.. 'ఇండియా జీతేగా' అంటూ జోరుగా నినాదాలు చేస్తున్నారు. ఇక ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆర్టిస్ట్​ జుహెబ్.. 15 ఫీట్ల ఎత్తైతో మ్యాచ్​లోగోను స్కెచ్ వేశాడు.

అహ్మదాబాద్ చేరుకున్న ప్రముఖులు.. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్​ను వీక్షించేందుకు భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్​, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి, నటి అనుష్క శర్మ.. అలాగే మ్యాచ్​కు ముందు జరిగే ఈవెంట్​లో పాల్గొనేందుకు బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ అహ్మదాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు.

లక్షా 30వేల మంది హాజరు.. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం.. నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్​కు వేదికకానున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఇండో-పాక్ మ్యాచ్​కు దాదాపు లక్షా 30వేల మంది హాజరుకానున్నట్లు తెలుస్తోంది.కాగా, ఇప్పటికే స్టేడియం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.