Fedex Cyber Fraud in Telangana : మార్కెట్‌లోకి కొత్త తరహా సైబర్ మోసం.. అలాంటి ఫోన్ కాల్ మీకూ వచ్చిందా..?
🎬 Watch Now: Feature Video
Hyderabad Cyber Crime ACP Interview on Fedex Fraud : ప్రజలు, పోలీస్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. రోజుకో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వస్తూనే ఉంది. నిరక్ష్యరాస్యుల నుంచి ఉన్నత విద్యావంతుల దాకా ఎవరినీ వదలని ఈ కేటుగాళ్లు.. రకరకాల మార్గాల్లో దొరికిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర లేపారు. ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. బాధితులకు సంబంధం లేకపోయినా.. ముంబై నుంచి తైవాన్‌కు మీ ఫోన్, ఆధార్ కార్డు నంబర్లతో ఫెడెక్స్ పార్శిల్ డెలివరీకి ఇచ్చారంటూ ఫోన్ చేస్తారు. ఆ పార్శిల్‌లో మాదక ద్రవ్యాలు గుర్తించామని.. సాయంత్రంలోపు అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని బెదిరిస్తారు. ఇదే తరహాలో హైదరాబాద్ పరిధిలో ఓ బాధితురాలి నుంచి రూ.80 లక్షలు సహా.. ఇప్పటి వరకు నమోదైన 7 కేసుల్లో సుమారు రూ.కోటికి పైగా బాధితుల నుంచి దోచుకున్నారు. ఈ అంశానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..